సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
జహీరాబాద్, జూన్ 13: సీజనల్ వ్యాధు లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారి సురేశ్ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం న్యాల్‌కల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలపై వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులతో పాటు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ముఖ్యంగా డెం గ్యూ, మలేరియా, అతిసారం, విష జ్వరాలు వంటి వాటిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయడమే కాకుండా తాగునీటి సరఫరా పైప్ లైన్ల లీకేజీలకు మరమ్మ తులు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఐకేపీ ఏపీఎం కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.






