16 April, 2026 | 10:06 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

చదువు జీవితాన్ని వెలిగించే దీపం

09-06-2025 12:09 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8, (విజయ క్రాంతి)కొత్తగూడెం పట్టణంలో గల జిల్లా గ్రంధాలయం నందు సీనియర్ సిటిజన్స్ వి ద్యానగర్ కాలనీ వారి ఆధ్వర్యంలో రూ 10 వేల విలువ చేసే సాధారణ వేడి , చల్లని , త్రాగునీరు అందించే వాటర్ కూలర్ ను జి ల్లా గ్రంథాలయానికి డి.ఎస్.పి ఆర్‌ఎస్ రెహమాన్ అందజేశారు . ఈ సందర్భంగా డిఎ స్పీ మాట్లాడుతూ చదువు జీవితాలను వెలిగించే చక్కటి దీపం అని, సామాన్య కుటుం బాన్ని సంపన్న కుటుంబం గా తీర్చిదిద్దుతుందన్నారు.

కష్టపడి, ఇబ్బందులను ఓర్చుకుని మంచిగా చదువుకున్న వారు నేడు ఉన్నత స్థానాల్లో నిలిచారన్నారు. నేటి రోజుల్లో చదువుకునేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల స దుపాయాలు కల్పిస్తున్నాయని, కనీస మౌ లిక సదుపాయాలు లేని రోజుల్లో వీధి దీపా లు, కిరోసిన్ లాంతర్ల ముందు కూర్చుని చదువులు సాగించారని గుర్తు చేశారు.విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదివి న లక్ష్యం సహకారం అవుతుంది, కృషి ,పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు.

గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు వం టివనీ, వాటిని సద్వినియోగం చేసుకొని మంచి వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు స దుపాయాలు కల్పిస్తుందని మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృ షి అభినందనీయమన్నారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బ్రతుకులను బంగారు మయంగా మలుచుకోవాలని, మ న ప్రవర్తన ఆధారంగానే జీవితాలు అభివృ ద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదుల, సీనియర్ సిటిజెన్ సభ్యులు ప్రెసిడెంట్ కోట్ల నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్ కుమార్, ట్రెజరర్ ధర్మరాజు, కేశవరావు విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.