09-06-2025 12:10:57 AM
మచ్చ నర్సింహారావు
అశ్వాపురం జూన్ 8 (విజయ క్రాంతి): కెసిఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మచ్చ నరసింహారావు అన్నారు. మల్లెల మడుగులో ఆదివా రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కెసిఆర్ దళిత వర్గాన్ని గత పదేళ్లుగా నట్టేట ముంచారని గుర్తు చేశారు.
ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి కారణం నేడు సామాన్య హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడు అంటే, సమున్నత స్థాయికి వచ్చాడు అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే కారణమని తాను విశ్వసిస్తున్నానన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కేసీఆర్ ఒకే ఒక దళితుడికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి అనతి కాలంలోనే తొ లగించార అని గుర్తు చేశారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో దళితులకు నాలుగు కీలకమైన మంత్రి పదవులను ఇచ్చి దళితులకు పెద్దపీట వేసినం దుకు గాను యావత్ తెలంగాణ దళిత సా మాజిక వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కెసిఆర్ చేసిన అప్పు లకు ఎనిమిది వేల కోట్ల వడ్డీని ఇప్పటికి కాం గ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా ఆదరణ పొందుతున్నదన్నారు.
దళితులను పట్టించుకోకుండా పదవులు కూడా ఇవ్వకుండా పదేండ్లు సాగిన బిఆర్‌ఎస్ పార్టీ రా బోయే రోజుల్లో ఇక తెలంగాణలో కనుమరుగైపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బేతం రామకృష్ణ, చెంచల రాము,గొడ్ల నాగేశ్వరరావు, యాకూబ్, వెంకటి, రాణి, వీరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.