చదువుకు పేద, ధనిక భేదం లేదు
కేసముద్రం, ఆగస్టు 7 (విజయక్రాంతి) : చదువుకు పేద ధనిక భేదం లేదని, ప్రభుత్వం పేదల విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు.
బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన కల్వల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన మండ సహస్ర, బానోత్ నవ్య, బాదావత్ అనూష , తెలుగు మీడియం లో అత్యధిక మార్కులు సాధించిన భాను సింధు బోడ శిరీషలకు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు జిలకర యాకాంతం ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల నగదు, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






