8 August, 2026 | 1:58 AM

ఏజెన్సీలో నకిలీ నోట్ల చలామణి..

08-08-2026 01:01 AM

మోసపోతున్న అమాయక గిరిజనులు

ఉట్నూర్, ఆగస్టు 7: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో 500 రూపాయల నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో నకిలీ నోట్లు చేరుకుంటున్నాయి. అమాయక గిరిజనులను ఆసరా చేసుకుని కొంతమంది నకిలీ నోట్లను అంటగడుతున్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని రూ. 500 నకిలీ అప్పగించారు.

పెట్రోల్ బంకులో వచ్చిన డబ్బులను పెట్రో ల్ బంక్ నిర్వాహకుడు స్థానిక యూనియన్ బ్యాంకులో బంకులో వచ్చిన డబ్బులను డిపాజిట్ చేసేందుకు వెళ్లగా అందులో కొన్ని రూ. 500 నకిలీ నోట్లు బ్యాంక్ అధికారుల గుర్తించారు. బ్యాంకులో ఫేక్ రూ. 500 నోటును తిరస్కరించడంతో నకిలీ నోటు వ్యవహారం బయటకు వచ్చింది. నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిఘా ఉంచి నకిలీ నోట్లను సరఫరా చేసే వారిని పట్టుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.