విద్యా బోధన ఆహ్లాదకర వాతావరణంలో సాగాలి
- కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ రూరల్, జూన్ 27: ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యా బోధన చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇం గ్లీష్‌లో రాయడం, చదవడం నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా పిల్ల లకు నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మండల విద్యాధికారి బాబు సింగ్, హెచ్‌ఎంలు అనంత్ రెడ్డి, యూనిస్, శ్రీశైలం పాల్గొన్నారు.




