13 April, 2026 | 5:14 AM

గంజాయిపై ఉక్కుపాదం

28-06-2024 04:27 AM
  • సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపేష్

సంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి): గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, సాగు చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపే ష్ హెచ్చరించారు. గురువారం నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీసు అధికారుల తో క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాల విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేయాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా నిర్వ హించాలన్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. గతంలో గంజాయి సాగు, అక్రమ రవాణా అనుమానితులుగా ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, నారాయణఖేడ్, కంగ్టి సీఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్, డీసీఆర్‌బీ సీఐ రమేశ్, ఎస్సైలు పాల్గొన్నారు.