2 May, 2026 | 1:06 PM

ఆర్జీల సత్వర పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి

09-12-2024 11:14 PM

ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందించే ఆర్జీల సమస్యల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ వారం వివిధ సమస్యలపై 78 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజలు ఎంతో ఆశతో నమ్మకంతో వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారని, అందుచేత వారిని నిరాశపరచకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ ఫిర్యాదుల విభాగంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జడ్పి సీఈఓ జితేందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.