2 September, 2026 | 10:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఖానాపూర్ లైబ్రరీలో విద్యా వారోత్సవాలు

15-05-2026 | 07:23pm

పదివేల రూపాయల పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ గ్రంథాలయంలో విద్యా వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాల్గోట్  కిషన్ విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పాఠ్య పుస్తకాలను గ్రంధాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తుడసం ఇందిరా, నాయకులు అంకం మహేందర్ ,మేసా సతీష్, ఖానాపూర్ లైబ్రేరియన్ శ్రీ పృథ్వి, మండల విద్యాశాఖ అధికారి సంధ్యారాణి, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, పాఠకులు పలువురు పాల్గొన్నారు.