మాస్టర్ జీ కళాశాలలో విద్య అవగాహన సదస్సు
చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న ఉన్నత విద్యామండలి చైర్మన్
హనుమకొండ, జూన్ 29 (విజయక్రాంతి): హనుమకొండలోని మాస్టర్జీ డిగ్రీ పీజీ కళాశాలలో నూతన 2026-27 సంవత్సరం డిగ్రీ పీజీ సిలబస్ పై విద్య అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. కిష్టారెడ్డి హాజరై మాట్లాడుతూ, డిగ్రీ దండగ కాదు, పండుగ అని రాబోవు రెండు దశాబ్దాలు విద్యారంగం చాలా కీలకం అన్నారు. కొత్తగా కొన్ని కోర్సులు తీసుకురావడం జరిగిందని ట్రెండింగ్ సబ్జెకట్స్ తీసుకురావడం జరిగిందని ప్రతి అధ్యాపకులు కొత్త సమాచారాన్ని నూతన సిలబస్ కు అనుగుణంగా అవగాహన పరుచుకుంటూ ముందుకు సాగాలని అలాగే కొత్త టెక్నాలజీని పునికిపుచ్చుకోవాలని అన్నారు.
మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్ సంఘంరెడ్డి సుందర్ రాజ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు నూతన సిలబస్ ను అవగాహన చేసుకుంటూ విద్యార్థులు అద్భుతంగా వాళ్ళు ఉద్యోగాల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని అన్నారు.అలాగే కళాశాలలకు విశ్వవిద్యాలయంకు అనుసంధానం ఉండాలని అన్నారు. కొత్త కోర్సులు వచ్చినప్పుడు అవగాహన సదస్సు నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఓ ఎస్ డి వెంకట్రామిరెడ్డి, కళాశాల జనరల్ సెక్రెటరీ సంగంరెడ్డి అచ్యుత్ రాజ్, విశ్వ రాజ్, ధనరాజ్, లక్ష్మీ నరసింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, స్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ, వివిధ కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.






