23 July, 2026 | 1:51 AM

విద్యాసామర్థ్యాలు మెరుగుపడాలి

23-07-2026 12:00 AM

డీఈవో వాసంతి 

పాల్వంచ  జూలై 22, (విజయక్రాంతి): విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి ఆదేశించారు. పాల్వంచ పట్టణంలోని బోల్లూరుగూడెం ఉన్నత పాఠశాలలో  నిర్వహిస్తున్న  ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమంను బుధవారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఈ విద్యాసంవత్సరం ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి మౌలిక భాషా, గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలని, అదేవిధంగా వెనుకబడిన విద్యార్థులకు రెమిడీయేషన్ తరగతులు నిర్వహించి వారి అభ్యసనను మెరుగుపరచాలన్నారు. 

ప్రతి కాంప్లెక్స్ పరిధిలో మూడు ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలను ఎఫ్ ఎల్ ఎన్ కాంపిటెన్సీ పాఠశాలలు గా ప్రకటించడం జరిగిందన్నారు. ఆ పాఠశాలలో 100% విద్యార్థులు విద్యా సామర్ధ్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీరామ్మూర్తి , మాధవరావు పాల్గొన్నారు.