విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
వేములవాడ, జూలై 10 (విజయక్రాంతి): ఎస్‌ఎఫ్‌ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్తపల్లిలో..
కొత్తపల్లి, జూలై ౧౦ (విజయక్రాంతి): వామపక్ష విద్యార్ధి సంఘాలు (ఏస్‌ఎఫ్‌ఐ-పిడిఎస్ యు - ఎఐడిఎస్ యు - ఎఐఎఫ్ డి ఎస్-ఎఐఎస్ బి) కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రామప్రతాప్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్,పిడిఎస్యు జిల్లా కార్యదర్శి అంగడి కుమార్, ఏఐ ఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, ఏఐఎస్బి రాష్ట ఉపాధ్యక్షుడు అతీకము రాజశేఖర్, వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మామిడిపల్లి హేమంత్, నునవాత్ శ్రీనివాస్ నాయక్,రోహిత్ ,సురేష్,నరేష్ , అస్లాం తదితరులు పాల్గొన్నారు.






