ఇసన్నపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
భిక్కనూర్, జూలై 10(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన నూతన గృహానికి ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. లబ్ధిదారులు ఇట్టబోయిన లక్ష్మి, యాదగిరి దంపతుల ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులందరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులను పట్టు వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేకల రాములు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యాదగౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంద బాబు, నాయకులు నారాయణ, తిరుమల స్వామి తదితరులు పాల్గొన్నారు.






