8 July, 2026 | 6:03 PM

ఈ నెల 10న విద్యాసంస్థల బంద్

08-07-2026 05:22 PM

* ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు పూర్తి సహకారం అందించాలి

* ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర చాకలి పాపయ్య

పాపన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న విద్యాసంస్థల బందుకు పులుపునిచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర చాకలి పాపయ్య పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బంద్‌కు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేసారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. నాణ్యమైన, ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే తదితర డిమాండ్లతో ఈ నెల 10న విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.