calender_icon.png 28 January, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి

28-01-2026 12:55:54 AM

గిరిజన సంక్షేమానికి పెద్దపీట

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన బోధన అందించడంతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని పాడిబండ గ్రామం లో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, బోధనా విధానం, విద్యార్థుల అభ్యా స స్థాయిని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించా రు. ఈ సందర్భంగా రాగి జావాను స్వయంగా రుచి చూశారు.

అనంతరం తిర్యాణి మండలం గిన్నెదారి గ్రామంలో నిర్వహించిన మైకేల్ యార్క్ జయంతి జాతీయ గ్రామోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పాల్గొని ఆదివాసి సంప్రదాయ పద్ధతిలో మైకేల్ యార్క్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.మైకేల్ యార్క్ జ్ఞాపకార్థం నిర్మించిన లైబ్రరీ భవనం, స్టడీ సర్కిల్ రూమును కలెక్టర్ ప్రారంభించారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, భద్రాచలం మాజీ ఎంపీ చందా లింగయ్య దొ ర, గ్రామ సర్పంచ్ వేడుమా నరేష్, ఆదివాసి సంఘాల నాయకులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సం ఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.