calender_icon.png 28 January, 2026 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మం

28-01-2026 12:55:17 AM

  1. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నగరంలోని 36వ డివిజన్ లో రజక భవన్ నిర్మాణానికి శంఖుస్థాపన, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం, జనవరి 27 (విజయ క్రాంతి): ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మం రూలకల్పనకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక 36వ డివిజన్ లో 63 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రజక భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, రూ. 2.43 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి మంత్రివర్యులు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో అన్ని మౌళిక సదుపాయాల కల్పన చేస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్,  సిబ్బందిని పెంచి, 12 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజారోగ్యం కోసం పట్టణ పీ.హెచ్.సీ. ల ఏర్పాటు చేశామన్నారు. పట్టణ పి.హెచ్.సి. లతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి లోడ్ తగ్గుతుందని అన్నారు. ఆరోగ్య కేంద్ర సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మధ్య తరగతి, పేద వారికి ఉపయోగం కలుగుతుం దని అన్నారు.

కోట్ల రూపాయలు ఉన్నా రహదారులు ఇరుకుగా ఉంటే ఏమి ఉపయోగం లేదని, జనాభాకు తగ్గట్టు రహదారుల విస్తరణ చేస్తే, వ్యాపారం బాగా ఉంటుందని, విలువ పెరుగుతుందని, నగరం అందంగా తయారవుతుందని తెలిపారు. రోడ్ల విస్తరణతోనే మీ ఆస్తులకు విలువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని మంత్రి అన్నారు. కస్బా బజార్ విస్తరణతో బ్రాండెడ్ షో రూమ్ లు వచ్చాయని తెలిపారు. చుట్టుపక్కల జిల్లాల వారు  ఖమ్మం లో నివసించేలా మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. విస్తరణలో కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు.

ఖమ్మం నగరంలో అన్ని కులాలు, వర్గాల వారు సామరస్య జీవనం ఉండేలా ఖమ్మం నగరాభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధి కారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.