కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌కు కృషి
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): రాష్ట్రంలో అర్హత కలిగిన, నైపుణ్యమున్న, సెమీ స్కిల్డ్ కార్మికులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో కార్మికులకు, నర్సులకు అధిక డిమాండ్ ఉందని పేర్కొంది. జర్మనీలో చదువుకోవడానికి, నర్సింగ్‌లో 3 ఏళ్ల ఇంటర్నేష నల్ డిగ్రీని పొందేందుకు తమ సంస్థ తర పున అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది.
చదువుకునే సమయంలో మూడేళ్లపాటు నెలకు రూ.1 లక్ష స్టుఫైండ్‌తోపాటు కోర్సు అనంతరం నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో నర్సుగా ఉద్యోగం వస్తుందని హామీ ఇస్తున్నట్టు వెల్లడించింది. దీనికి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న అర్హులని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు జర్మనీకి వెళ్లడానికి ముందు వారికి జర్మన్ భాషలో ఆరు నెలల రెసిడెన్షియల్ శిక్షణ హైదరాబాద్‌లో అందించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.






