2 గంటల నుంచి గ్రూప్ -1 పరీక్షా సమయంలో మార్పులు
17-08-2024 01:03 AM
- అక్టోబర్ 21 నుంచి పరీక్షలు
- ప్రకటించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణనుమధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎ స్సీ) ప్రకటించింది.ఈ మేరకు పరీక్షల సమయం లో మార్పులు చేసినట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇది వరకు మధ్యాహ్నం 2:30 గంట ల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్ నోట్ ఇచ్చామని పేర్కొంది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది.






