calender_icon.png 29 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం

29-12-2025 12:00:00 AM

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ

ముషీరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ భరోసా ఇచ్చారు.

ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్‌లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేం దుకు కృషి చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు.

అదే విధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. 252 జిఓలో ఉన్న కొన్ని లోటు పాట్లను తాము గుర్తించామని, వాటి ని సవరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు స్పష్టం చేసారు. ఈ సమావేశంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాము లు, ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, కార్యదర్శులు కె.శ్రీకాంత్ రెడ్డి, వరకాల యాదగిరి, జి.మధు గౌడ్, కోశాధికారి ఎం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.