24 August, 2026 | 10:24 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

ఆలయాభివృద్ధికి కృషి చేయాలి

24-06-2025 12:46 AM

- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

- కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ ధర్మకర్తగా ముద్ద రాజేశ్వరి ప్రమాణ స్వీకారం 

 ఎల్బీనగర్, జూన్ 23 : పురాతన చరిత్ర కలిగిన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆల య నూ తన ధర్మకర్తగా చంపాపేటలోని దుర్గాభవాని నగర్ కాలనీకి చెందిన ముద్ద రాజేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ధర్మకర్తగా ఎంపికైన మోరిశెట్టి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆయన స్థానం లో రాజేశ్వరిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వుల జారీ చేశారు.

ఈ మేరకు సోమవారం ఆలయంలో రాజేశ్వరితో అలయ ఈవో లావణ్య, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సమక్షములో దేవాదాయ శాఖ పరిశీలకుడు సీహెచ్ ప్రణీత్ కుమార్ ప్రమాణ స్వీకారం చే యించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ... ధ్యానాంజనేయ ఆలయాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడు తూ... ఆలయ ధర్మకర్తలు ఐక్యంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయా భివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.

ఆలయాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆలయ భూములపై ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మకర్త రాజేశ్వరి హన్మంతరావుతో పాటు ఆమె కుమారులు మీర్ పేట కార్పొరేటర్ ముద్ద పవన్, ఆలయ మాజీ ధర్మకర్త కల్యాణ్, ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు ప్రవీణ్ గౌడ్, నారాయణ, దుర్గారెడ్డి, కిరణ్, పూల నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, కవిత, నరేశ్, సంతోష్, సింగంశెట్టి శ్రీనివాస్, నాయకు లు జయంత్, నవదీప్, సురేందర్ రెడ్డి, అరవింద్, చందు, సుచిత్, సాయిప్రకాశ్, సందీప్, వికాస్, సతీశ్ యాదవ్, శ్రీకాంత్, ఆలయ సిబ్బంది రమాదేవి వెంకటయ్య, వీరేశ్ తదితరులుపాల్గొన్నారు.