calender_icon.png 23 February, 2026 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయంలో మార్పులు తెచ్చేందుకు కృషి

23-02-2026 12:00:00 AM

  1. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఎన్టీఆర్ స్టేడియంలో ముగిసిన రైతు బడి అగ్రి షో

ముషీరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. దేశంతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యువత కూడా ఐటీ రంగాన్ని వదిలిపెట్టి వ్యవసాయ రంగంపై మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

ప్రపంచంలో వ్యవసాయం రంగంలో విప్లవం రాబోతుందని, వ్యవసాయ రంగం పట్ల యువత మొగ్గు చూపాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి ఆగ్రో ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజర్యారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాను కూడా కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానని, తన వ్యవసాయ పనులను చూసుకున్న తర్వాతనే ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాది మంది రైతులను ఏకతాటిపై తీసుకొచ్చిన రైతుబడి అగ్రిషో  నిర్వాహకులు రాజిరెడ్డితో పాటు పలువురిని ఆయన అభినందించారు. ఈ షోలో రైతులు పాల్గొన్నారు.