calender_icon.png 23 February, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మేకల సారంగపాణి జన్మదిన వేడుకలు

23-02-2026 12:00:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి):  సికింద్రాబాద్ సీతాఫలమండిలోని మేడి బావి ప్రభుత్వ బాలికల స్కూల్లో సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే  మేకల సారంగపాణి తన జన్మదిన వేడుకలను అనాధ పిల్లల తో కలిసి ఘనంగా  నిర్వహించారు.అనాధలంటే దేవుని ప్రతిరూపమని, వారి ఆశీర్వాదాలు జీవితంలో ఎంతో గొప్పవని కపటం లేని మనుషులని సారంగపాణి అన్నారు. అనాధ పిల్లలతో కలిసి వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఉందన్నారు.

ఈ సందర్భంగా పిల్లలకు భోజనాలు ఆయన  ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం సారంగపాణి  మాట్లాడుతూ ఈ అనాధ పిల్లలు భావితరంలో ప్రయోజకులుగా ఎదగాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు  బీజేపీ నేతలు, కార్యకర్తలు సారంగపాణి నిశాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.