27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

నాగారం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి

25-06-2025 01:21 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నాగారం, జూన్ 24 : నాగారం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి,  సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, పెయింటింగ్, ఫెన్సింగ్ లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

దీంతో వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పందించి మూడు రోజుల్లో నాగారం వచ్చి స్వయంగా  పాఠశాలను పరిశీలించి సొంత నిధులను కేటాయించి పూర్వ విద్యార్థిగా బాధ్యతను నెరవేర్చుతనన్నారు. ఆయనను కలిసిన వారిలో ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు చిప్పలపల్లి నాగార్జున, కన్నెబోయిన శివకుమార్, కత్తుల వెంకన్న, చిప్పలపల్లి చిరంజీవి, వెంకన్న  తదితరులు ఉన్నారు.