పశుపోషణపై ఎల్ నినో ప్రభావం నివారణకు కృషి
జిల్లా పశువైద్య పశుసంవర్ధక అధికారి -డా. బోడే పూడి శ్రీనివాసరావు
కోదాడ, జూలై 28 :పశుపోషణ పై ఎల్ నినో ప్రభావం నివారణకు కృషి చేయాలని జిల్లా పశువైద్య పశుసంవర్ధక అధికారి -డా. బోడే పూడి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో కోదాడ నియోజకవర్గ పశువైద్యులకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావం కారణంగా జిల్లాలో పశుపోషకులు పశుగ్రాసం కొరత ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ పశుగ్రాసం కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.
గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న పశువుల సంఖ్య వాటికి మరో ఆరు మాసాల వరకు కావలసిన పశుగ్రాసం ప్రస్తుతం రైతుల వద్ద అందుబాటులో ఉన్న పశుగ్రాసం లెక్కలతో వేసిన పంటల ద్వారా ఖాళీ భూముల ద్వారా అందే పశు గ్రాసం మొత్తం లెక్కించి అవసరం అండి బాటులో ఉన్న గ్రాసం తీసి వేయగా లోటు పశుగ్రాసాన్ని గుర్తించాలని సూచించారు.
అలా గుర్తించిన పశు గ్రాస లోటును పూరించడానికి నీటి వసతి ఉండి, పశువులు కలిగి ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి సబ్సిడీలో అందుబాటులో ఉన్న పశుగ్రాస విత్తనాలను అందించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, వివిధ మండలాల పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డా కె ఉషారాణి, డా కె వీరారెడ్డి, డా యం రవికుమార్, డా. అఖిల, డా. మధు, డా హరిత,డా సురేష్,డా సిరిపురపు సురేంద్ర పాల్గొన్నారు.






