7 May, 2026 | 1:28 AM

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి

07-05-2026 12:00 AM

చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ బాబు 

కోదాడ, మే 6 :  మున్సిపాలిటీ లోని అన్ని వార్డులలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పేర్కొన్నారు. బుధవారం 9వ వార్డులోనీ సాలార్జంగ్ పేటలో లక్ష రూపాయల విలువ కలిగిన డ్రైనేజీ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించాలని పాలకవర్గం సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానన్నారు.. వార్డు కౌన్సిలర్ చీమ నరేష్ మాట్లాడుతూ వార్డును మున్సిపాలిటీ పరిధిలో రోల్ మోడల్ గా నిలుపుతానని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి వార్డు ప్రజలు పాల్గొన్నారు.. కాగా ఆ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు లబ్ధిదారులకు కౌన్సిలర్ నరేష్ రేషన్ను అందజేశారు.