7 May, 2026 | 1:30 AM

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులతో ఉద్యోగ అవకాశాలు

07-05-2026 12:00 AM

కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు

నల్లగొండ టౌన్, మే 6 :  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల( ఆటానమస్) లో కొత్త కోర్సులను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ సుంకరి రాజారాంలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించిన అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడిపి) కింద కళాశాలలో మూడు ప్రత్యేక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టిందని, ‘చదువుతూ సంపాదించు‘ మోడల్లో క్లాస్ రూమ్ చదువుతో పాటు పరిశ్రమల్లో ఆచరణాత్మక శిక్షణ, స్టైపెండ్లు అందించే ఈ కోర్సులు విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేస్తాయన్నారు.

బ్యాంకింగ్, హెల్త్కేర్, ఫార్మా రంగాల్లో 40 శాతం కరిక్యులమ్ను పరిశ్రమ నిపుణులను అందించేలా, అప్రెంటిస్షిప్, లైవ్ ప్రాజెక్టులు, మెంటర్షిప్లో రూపొందించారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో బి.కామ్ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) కోర్సు ద్వారా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో శిక్షణ, స్టైపెండ్ పొందే అవకాశం ఉందన్నారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంక్ క్లర్క్, రిలేషన్షిప్ మేనేజర్, లోన్ అధికారి, ఫైనాన్షియల్ అనలిస్ట్, అకౌంటెంట్ గా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. బి.ఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్ ఏఈడీపీ ద్వారా విద్యార్థినులకు హాస్పిటల్/క్లినిక్లలో 6 నెలల పనిచేసిన అనుభవం లభిస్తుందన్నారు.

దీనికి స్టైపెండ్ రూ. 7 12 వేలు నెలకు లభిస్తుందనీ పేర్కొన్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్, మెడికల్ కోఆర్డినేటర్, క్లినిక్ మేనేజర్ గా ఉద్యోగాలు పొందవచ్చన్నారు. బి.ఎస్సీ (ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ) ఫార్మా కంపెనీల్లో ప్రొడక్షన్/క్వాలిటీ కంట్రోల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని దీనికిగాను విద్యార్థులకు స్టైపెండ్ రూ.8- 15 వేలు పొందే అవకాశం ఉందని, ఈ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థినులకు : ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు పొందవచ్చన్నారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం నుండి నూతన కోర్స్ లు ప్రవేశపెట్టినట్లు వివరించారు.