9 April, 2026 | 2:46 AM

తల్లి, పిల్లల సంరక్షణకు కృషి

09-04-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయడం ద్వారా తల్లి , పిల్లల సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ఆర్.ఎం.ఓ. శ్రీధర్‌లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వంప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్య లు చేపడుతుందని తెలిపారు. ప్రజలకు మరిం త మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆసుపత్రులు, సామాజిక ఆసుపత్రులు, ప్రభు త్వ ఆసుపత్రులు, పల్లె, పట్టణ దవాఖానాలు, ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అలాగే జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతు న్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23. 75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.