నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
09-04-2026 12:00 AM
ఎమ్మెల్యే వెడ్మ బుజ్జి పటేల్
ఖానాపూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): నియోజకవర్గంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జి పటేల్ అధి కారులను ఆదేశించారు. బుధవారం ఖానాపూ ర్ పట్టణంలో సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. కడెం, దస్తురాబాద్ పెంబి తదితర మండలాల్లో నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలను ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. మిషన్ భగీరథపై పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.




