మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి కృషి
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 3(విజయ క్రాంతి): స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. మండల సమైక్య భావన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి పాల్గొన్న ఆమె, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.మహిళలు స్వయం సహాయక సం ఘాల ద్వారా పొదుపు పెంపొందించుకుని, రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుం బ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని సూ చించారు.
స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని అదనపు ఆదాయం పొందేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యే క ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
సంఘాల సభ్యులు సమాఖ్యల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. మహిళలు ఐక్యంగా పనిచేస్తే కు టుంబాభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి కూడా దోహదపడతారని పేర్కొన్నారు.
ఓటరు సవరణలో వేగం పెంచాలి..
తిర్యాణి మండల కేంద్రంలో జరుగుతున్న ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్య క్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సేకరించి, వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రి య పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా, ఎలాంటి లోపా లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సూ చించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లా డి ఫారాలను పూర్తిగా నింపించుకోవాలని, అనంతరం బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) వాటిని డిజిటలైజేషన్కు పంపించా లని తెలిపారు. ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
యువజన సంఘాలు, చదువుకున్న యువత, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. గడువు తక్కువగా ఉన్నందున అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, బీఎల్‌ఓలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.






