ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత ఉండాలి
దిశా సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు
నిర్మల్ జూలై 3 (విజయ క్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న పనుల్లో పారదర్శకత ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీ నాగేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, వేడుమ బొజ్జు పటేల్ జిల్లా అధికారులతో కలిసి దిశా సమావేశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎజెండాలోని 40 అంశాలను శాఖల వారీగా సమీక్ష చేసిన ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ ప్రభుత్వ అధికారులకు చేపట్టే పనుల విషయంలో పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని పేద ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్న పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ నీటిపారుదల శాఖ గృహ నిర్మాణం డిఆర్డిఏ విద్యుత్ విద్య వైద్యం గిరిజన సంక్షేమం, నీటిపారుదల మిషన్ భగీరథ రోడ్లు భవనాలు తదిత శాఖల పనితీరును ప్రగతి నివేదికలను అడిగి తెలుసుకున్నారు
మంజూరు చేసిన పనులే చేస్తలేరు
నిర్మల్ జిల్లాలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులక పనులు మంజూరు చేస్తే క్షేత్రస్థాయిలో అధికారులు ఆ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఎంపీ నాగేష్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి వేడుమ బుజ్జి పటేల్ రామారావు పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పెండింగ్ పల్లలు పూర్తి చేయాలని పనులు చేయని గుత్తేదారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి నిర్మించాలన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత పాటించి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ వెంకటేశ్వర్లు డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి సుఖదేవ్ ప్రశాంత్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి మౌనిక జిల్లా అధికారులు ఉన్నారు.






