28 June, 2026 | 2:01 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పాకాల ఏటీపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి

14-05-2025 12:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మహబూబాబాద్, మే 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం పాకాల ఏటి పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో మూడు రోజుల పాకాల యేటి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులగా నా నిద్రాహారాలు మానేసి సంఘటితంగా నిరాహార దీక్ష చేసినందుకు మీకు విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ పాకాల యేటి పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ భారం నాకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వం తో కొట్లాడి బ్రిడ్జికి నిదులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ నెల 17న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల ముఖ్య నాయకత్వంతో ఉపముఖ్యమంత్రి బట్టీ విక్రమార్కతో భేటి అవ్వ నున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి తెలియజేశారు. ఈ మూడు రోజుల పాటు దీక్ష లో పాల్గొన్న నాయకత్వం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, రాగం రమేష్, దార్ల నాగేష్, సింగు రమేష్, దూపాటి జనార్దన్, మాగం లోకేష్, ఇరుగు వెంకటేష్, పొన్నం వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్ సారథి, పెరుగు కుమార్, చించకుంట్ల వెంకన్న,సాంబ లక్ష్మి,సారిక శ్రీనివాస్, వెలుగు శ్రావణ్, తండా సందీప్, నాదెండ్ల పద్మ, తండా సతీష్, మైమూద్, వీరవెల్లి రవి, కూరం భాగ్య, ఎర్రోజు పద్మ,రాణి, మాలోత్ రవిందర్, గుండా సుధాకర్ రెడ్డి, గుగులోత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.