14-05-2025 12:00:00 AM
అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.6 కోట్ల మోసం?
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావును హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు శ్రవణ్‌రావు రూ.6 కోట్ల మోసం చేశారని బాధితులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు.
దీంతో అతడిపై చీటింగ్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు.. మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శ్రవణారావుకు ౧౪ రోజుల రిమాండ్ విధించింది.