రాచకొండను పర్యాటక కేంద్రంగా చేయడానికి కృషి చేస్తా
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): రాచకొండను పర్యాటక కేంద్రంగా మార్చడానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను త్వరలోనే భేటీ కానున్నట్లు పర్యాటక హబ్ గా రాచకొండను మార్చడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) తెలిపారు. మంగళవారం మునుగోడులోని తన క్యాంప్ ఆఫీసులో కలిసిన రాచకొండ రాచప్ప సమితి సభ్యులకు ఈ విషయాన్ని తెలుపుతూ రాచకొండ అభివృద్ధికి అధిక సంఖ్యలో నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజప్ప సమితి అధ్యక్షులు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్, ప్రధాన సలహాదారు కడారి అంజిరెడ్డి, పుట్టపాక మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






