18 July, 2026 | 12:41 AM

మోడల్, గురుకుల టీచర్లకు ఈహెచ్‌ఎస్ అమలు చేయాలి

18-07-2026 12:41 AM

టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించడాన్ని టీపీటీఎఫ్ పక్షాన ఆహ్వానిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూల్స్, గురుకుల, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న టీచర్లకు, ఉద్యోగులకు కూడా ఈ  పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌కు సమా నంగా ప్రభుత్వం నుంచి గ్రాంటు ప్రతినెల జమ చేయాలని, వైద్య ఖర్చులను వెంటనే హాస్పిటల్స్‌కు చెల్లించాలన్నారు.