గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
మేడ్చల్, ఆగస్టు 22 (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం ఉంటుందని అన్నారు.
ప్రధాన చెరువులు, బేబీ పాండ్ల వద్ద స్టాటిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక, కృత్రిమ నిమజ్జన కులను లను ఏర్పాటు చేయాలని సూచించారు. సరూర్నగర్, షఫీలు గూడా, కాఫ్రా చెరువులు ఇతర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
సమీక్ష సమావేశంలో ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లు రాధిక గుప్త, రంజిత్ గంగ వార్, వికాస్ మహతో, శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర రెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యు బి డి డైరెక్టర్ సునంద తదితరులు పాల్గొన్నారు.






