8 June, 2026 | 1:24 AM

టిప్పర్ ఢీకొని వృద్ధుడి మృతి

08-06-2026 12:00 AM

శంకర్‌పల్లి, జూన్ 7(విజయక్రాంతి): టిప్పర్ లారీ ఢీకొని వృద్ధుడు వర్షన్ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామ శివారులోల్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. శంకర్ పల్లి పోలీసులు తెలిపియువరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తుతెలియని వృద్ధుడు (80)ని టిప్పర్ లారీ (TS 05 UF1167) రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బలం గా డీ కొట్టడం తో తాళకు, కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడం తో మతి స్థిమితం కోల్పోయి వి గతాజీవిగా పడుకున్నాడు.

రోడ్డుపై గమనించిన స్థానికులు 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై పంపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిమిషాల వ్యవధిలో మృతి చెందాడని తెలిపారు. మృతి చెందిన వృద్ధుడికి మతిస్థిమితం లేకపోవడంతో వివరాలు తెలియలేదని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర సురేష్ తెలిపారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు.