02-12-2025 07:01:43 PM
వివిధ పార్టీల నుండి సిపిఐలో చేరికలు..
మునుగోడు (విజయక్రాంతి): ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు గ్రామంలో ఉండి ప్రజల పక్షాన నిలబడే నాయకులను ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల వారు 20 కుటుంబాలు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సమక్షంలో దండు వెంకటరమణ, మందుల పాండు, ఎం దయాకర్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించి మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పక్షాన కర్షక కార్మిక వర్గానికి అండదండగా ఉంటూ వారి శ్రేయస్ కొరకు పాటుపడుతుందని కొరటికల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల వారు పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు.
ఏదో సుదీర్ఘ ప్రాంతంలో హైదరాబాదులో ఉంటూ ఏడాదికి ఓసారి ఊరికి వచ్చి ఊర్లో ప్రజలను వివిధ రకాల ప్రలోభాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత గ్రామాలను గ్రామ ప్రజలను పట్టించుకునే నాధుడే ప్రజలకు అందుబాటులో ఉండరని తెలిపారు. గ్రామానికి మంచి నాయకుడు ప్రజల పక్షాన నిలబడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతినిత్యం పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాలని వారన్నారు. చేరిన వారిలో దండు వెంకటరమణ, స్వప్న, అనంతమ్మ, భీమనపల్లి నరసింహ, కుప్పటి భూపాల్, దండు నవీన్ ,దండు సైదులు, దండు శ్రీను,ఆరెకంటి యుగంధర్, భీమనపల్లి నవీన్ సిపిఐ పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల కార్యవర్గ సభ్యులు ఎం దయాకర్, ఎం పాండు, గ్రామ శాఖ నాయకులు దండు యాదయ్య,రొమ్ముల యాదయ్య,మిర్యాల యాదయ్య, అద్దంకి పాపయ్య, ఉన్నారు.