calender_icon.png 2 December, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్లకుంట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోలంపల్లి కుటుంబరావు నామినేషన్

02-12-2025 07:05:14 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోలంపల్లి కుటుంబరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రెడ్లకుంట గ్రామం నుంచి పెద్దఎత్తున ఊరేగింపుగా బయలుదేరి కాపుగల్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించి ఆయన మాట్లాడారు. తనను బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాదరావు, మాజీ సర్పంచ్‌లు మరియమ్మ, నెట్టెం జగన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో గంగవరపు లక్ష్మణరావు తన సొంత స్థలాన్ని నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీకి అందించారని తెలిపారు.

అంతేకాకుండా గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు అని తెలిపారు. గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతర ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాలతో గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ అభ్యర్థికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో రాజకీయ ఉత్సాహం నెలకొనడంతో రెడ్లకుంటలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.