calender_icon.png 2 December, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ బలపరచిన అభ్యర్థుల గెలుపు ఖాయం..

02-12-2025 06:58:24 PM

బజార్హత్నూర్ (విజయక్రాంతి): బజార్హత్నూర్ మండలంలోని అన్ని సర్పంచ్ స్థానాలను బీజేపీ బలపరచిన అభ్యర్థులు కైవసం చేసుకుంటరని బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు సిడాం వికాస్ బీజేపీలో చేరగా, ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పోరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ... వార్డు మెంబర్స్ తో సహా అన్ని సర్పంచ్ స్థానాలను గెలుపే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, ప్రతీ నాయకులు, కార్యకర్తలు అందుకు తగినట్లుగా కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారన్నారు.