23 June, 2026 | 8:38 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

గెలిపించండి.. పాలకుడిగా కాదు..సేవకుడిలా పని చేస్తా

09-02-2026 01:58 AM

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ద తిరుపతి

సుల్తానాబాద్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుండి కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇవ్వండి పాలకుడి గా కాదు సేవకుడిగా మీ మధ్య ఉంటూ పని చేస్తానని సిద్ధ తిరుపతి ఓటర్ల ను వేడుకుంటున్నారు, ఆదివారం తన వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు,

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో వార్డు పరిధిలోని అన్ని సమస్యలుపరిష్కరించడంతోపాటు, అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని సిద్ధ తిరుపతి ఇంటింటా తిరుగుతూ ఓటర్ల కు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్ దేవుళ్లనువేడుకుంటున్నారు...