calender_icon.png 9 February, 2026 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం

09-02-2026 01:59:44 AM

  1. ఏడు రాష్ట్రాల్లో హెచ్‌సీసీసీ పోలీసుల ఆపరేషన్లు
  2.   37 మంది అరెస్ట్ 
  3. ఒక్క నెలలోనే 117 ఎఫ్‌ఐఆర్‌లు
  4. రూ.65 కోట్ల అక్రమ లావాదేవీల గుర్తింపు
  5. బాధితులకు 72 లక్షల నగదు రీఫండ్
  6. వివరాలను వెల్లడించిన డీసీపీ అరవింద్‌బాబు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సైబర్‌నేరాలను వేళ్లూనుకోకుండా అరికట్టడమే లక్ష్యంగా సరిహద్దులు దాటి మరీ ఆపరేషన్లు నిర్వహిస్తు న్నారు. గత నెలలో చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 37 మంది కరుడుగట్టిన సైబర్‌నేరగాళ్లను అరెస్ట్‌చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ దాడుల ద్వారా 26 అత్యంత కీలకమైన కేసులను ఛేదించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వీ అరవింద్‌బాబు ఆదివారం వెల్లడించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టిన ప్రత్యేక బృందాలు.. నిందితు లను పట్టుకోవడమే కాకుండా బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ.71.91 లక్షలను తిరిగి రప్పించి బాధితులకు అందజేశాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం గణాంకాల ప్రకారం, ఒక్క జనవరిలోనే మొత్తం 117 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

వీటిలో 15 ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ప్రస్తుతం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న 2 డిజిటల్ అరెస్ట్ కేసులు, 4 సోషల్ మీడియా ఆధారిత పోక్సో కేసులు, 5 బిజినెస్, గేమిం గ్, జాబ్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. అరెస్టయి న నిందితుల నేర చరిత్రను పరిశీలించగా, వీరికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన 86 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలిం ది. ముఖ్యంగా తెలంగాణలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 14, కర్ణాటకలో 15, మహారాష్ట్రలో 14, రాజస్థాన్‌లో 12 కేసులతో పాటు గుజరాత్, కేరళ, ఢిల్లీ వంటి పదికి పై గా రాష్ట్రాల్లో వీరి ముఠాలు తమ నేర సా మ్రాజ్యాన్ని విస్తరించినట్లు పోలీసులు గుర్తిం చారు.

నిందితుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలను లోతుగా విశ్లేషించిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ కేటుగాళ్లు ఇప్పటివరకు దాదాపు రూ.65 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా నింది తుల వద్ద నుంచి 26 సెల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్ బుక్కులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి-మిత్ర విభాగం కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోం ది.

ఈ విభాగానికి అందిన 1,706 ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు 315 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సి-మిత్ర ద్వారా మరో 13 మంది నేరగాళ్లను అరెస్ట్ చేయడమే కాకుండా, రూ.10.65 లక్షల నగదును బాధితులకు తిరిగి ఇప్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ అరవింద్‌బాబు పలు కీలక సూచనలు చేశారు. ఉన్న తాధికారుల పేర్లతో వచ్చే నకిలీ వాట్సాప్, సోషల్ మీడియా మెసేజ్‌లను చూసి మోసపోవద్దన్నారు.

అధిక లాభాల పేరుతో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి స్కీమ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేస్తూ బెదిరించే వారిని చూసి భయపడవద్దని, పోలీసులెప్పుడూ ఫోన్‌కాల్స్ ద్వారా అరెస్టులు చేయరని స్ప ష్టం చేశారు. బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులు లేదా ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.

ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్ నేరం జరిగిన మొదటి గంట లోపు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సకాలంలో స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును నిందితుల ఖాతాల్లోనే ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.