calender_icon.png 19 January, 2026 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

19-01-2026 12:12:49 AM

కరీంనగర్ క్రైమ్, జనవరి18 (విజయ క్రాంతి): కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ జిల్లా ఇన్చార్జి అక్కి బాలకిషన్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ కోరారు. ఆదివారం వారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను అన్ని డివిజన్ లలో పోటీ చేయించడానికి నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

అదేవిదంగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల పరిధిలో వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర వర్ణ పేదలలో వున్న బహుజన సమాజం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వెంట ఉండాలని వారు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఊళ్లేందుల మహేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాళి తిరుపతి, ఉల్లేందుల అరుణ్ కుమార్, మచ్చ సంపత్, మునుగురి నివాస్, కనకం రఘు, సంతోష్, అరెల్లి రాజు, కత్తి సాయి, ముత్తగళ్ల సాయిరాం, బివిఎఫ్ ప్రభాకర్, మ్యాక సాయి, తదితరులు పాల్గొన్నారు.