19-01-2026 12:12:05 AM
బీఆర్‌ఎస్ గత అధికార బలంతో చెరువులను చెరబట్టిన రియల్ మాఫియా
గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన అస్తంగా వాడుకున్న నాటి ప్రతిపక్షం
ఎన్జీటీ కోర్టును సైతం లెక్కచేయని గత అధికారులు, పాలకులు
మరిన్ని పెరిగిన ఆక్రమణలు, నిర్మాణాలు.
అక్రమార్కుల నింద మోస్తున్న వారే నేడు అధికార పార్టీలోకి ఎంట్రీ
నాగర్ కర్నూల్ జనవరి 18 ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ మాఫియా గ్యాంగ్ తల్లి లాంటి చెరువులు, కుంటలను, నాలాలను కబ్జా చేసి వెంచర్లుగా మార్చి కోటాను కోట్లు మూట గట్టుకున్నారు. స్థానిక రైతులు ఇతరుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసుల నుంచి తప్పించుకునేందుకు గత బిఆర్‌ఎస్ పార్టీతో అంటకాగుతూ పార్టీ బీఫాములతో ఓట్లు కొనుగోళ్లతో కౌన్సిలర్లుగా చలామణి అయ్యారని టాక్. కిరికిరి భూములు, ప్రధాన గొలుసుకట్టు చెరువులు పక్కన పట్టా భూముల కొనుగోలు ఆపై చెరు వు శిఖం భూములను కబ్జా చేసి విలాసవంతమైన భవనాలు అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
కా కతీయుల నాటి గొలుసు కట్టు చెరువులను సైతం నాళాలు వాటికి అనుసంధానంగా ఉన్న కుంటలను కూడా అమాంతం మింగేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంత చెరువుల మ నుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని గుర్తిస్తూ కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా అప్పట్లో 53 ప్రదేశాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ వంటి శాఖలు వేర్వేరుగా నివేదికలు సైతం కోర్టుకు వెల్లడించారు.
అప్పట్లో ఈ అంశంపైనే మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రధాన అస్త్రంగా వాడుకొని తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పట్లో ఒకటి రెండు ప్రదేశాల్లో నిర్మాణాలు కూల్చివేస్తూ అన్నింటిని కూల్చినట్లుగా కోర్టును సైతం తప్పుదారి పట్టించినట్లు చర్చ జరిగింది. ఆ తర్వాత సదరు వ్యక్తులు కూడా మౌనంగా ఉండడం పట్ల తెర వెనుక వ్యవహారం నడిచినట్లు చర్చ జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులను కుంటలను పరిరక్షించడం కోసం హైడ్రా పేరుతో ఆక్రమణలను తొలగించి అందరి నుంచి మెప్పు పొందారు.
దీంతో నాగర్ కర్నూల్ ప్రాంతంలోనూ ఆక్రమణకు గు రైన చెరువులో కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ అదే రియల్ మాఫియా అధికార పార్టీతో అంట కాగుతూ రెట్టింపు స్థాయిలో చెరు వులు కుంటలు కబ్జాకు గురించేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి అధికార పార్టీలోకి ఎంట్రీ ఇస్తుండడంతో ప్రస్తుతం కేసరి సముద్రం కబ్జా వ్యవహారం చర్చకు వచ్చింది. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్ కర్నూల్ పర్యటన సందర్భంగా వారి సమక్షంలో కొంతమంది మాజీ కౌన్సిలర్లు పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి భూ కబ్జా దా రులు ఎంట్రీతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.