రాయికల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
28-04-2026 02:08 PM
జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో(Raikal Municipality) కో-ఆప్షన్ సభ్యులుగా మాజీ వార్డ్ మెంబర్ సుధవేణి లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేష్,మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ అలీ,ఇంతియాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారికి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని నూతన కో-ఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.






