28 August, 2026 | 7:17 AM

ఓటు విషయంలో నిర్లక్ష్యం చేయకండి

28-08-2026 01:07 AM

జడ్చర్ల: జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఈఆర్ఓ) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్/ఏఈఆర్ఓ, అదనపు తహసీల్దార్,జడ్చర్ల మండలం మున్సిపాలిటీ కమిషనర్, మరియు ఎన్నికల డిటి 75–జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఆర్ఓ ఫారం–6,ఫారం-7 మరియు ఫారం-8 ద్వారా దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.అర్హత కలిగిన వ్యక్తులు కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఇప్పటికే ఉన్న ఓటర్లు తమ వివరాల్లో సవరణలు చేయించుకునేందుకు సంబంధిత నిర్దేశిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.