బోధన్ డిపో ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక
బోధన్, మే 31 (విజయక్రాంతి): బోధన్ ఆర్,టి,సి డిపో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన సమావేశం లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్, రీజినల్ ప్రధాన కార్యదర్శి సాయిలు , రీజినల్ మెంబర్ దశరథ్ ల ఆధ్వర్యంలో డిపో అధ్యక్షుడిగా హనీఫుద్దిన్, కార్యదర్శిగా జి.ఎన్ గౌడ్, కోశాధికారి గా ఎమ్ గంగారాం,
వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి. పోతా రెడ్డి, గ్యారేజ్ కార్యదర్శి గా సురేష్, మహిళా కార్యదర్శి గా బి.ఎ. రాణి, మహిళ ప్రెసిడెంట్ గా డి. కమల లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి జి.ఎన్ గౌడ్ మాట్లాడుతూ... కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కొరకు కార్మికులతో కలిసి యాజమాన్యంతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.






