1 June, 2026 | 2:46 AM

జిల్లాలో 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలు

01-06-2026 01:55 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, మే 31 (విజయక్రాంతి): జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ   యం. రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి  జిల్లాలో శాంతి భద్రతలను  దృష్టిలో  వుంచుకొని నెల రోజుల పాటు (జూన్ 1వ తేది నుండి 30 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని   కామారెడ్డి  జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా లో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు,

నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ  హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.