13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ నూతన కమిటీ ఎన్నిక

28-03-2026 12:03 AM

మణుగూరు, మార్చి 27 (విజయక్రాంతి) : లైన్స్ క్లబ్ ఆఫ్ మగువ నూతన మండల కమిటీని శుక్రవారం స్థానిక సత్యభాస్కర థియేటర్ లో జరిగిన సమావేశంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన లేడీస్ క్లబ్ అధ్యక్షురాలుగా వన్నం నాగదేవి, సెక్రటరీగా  మేదరమెట్ల లక్ష్మీ, ట్రెజరర్ గా గాజుల నాగేశ్వరీ, 25 మంది మహిళా సభ్యులు ఎంపికయ్యారు. 320 E లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్మోహన్  రేపాల నూతన కమిటీతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ మగువను మండలంలో బలోపేతం చేసి, సామాజిక కార్యక్రమాలు చేప ట్టేందుకు తనవంతు కృషి చేస్తామని తెలిపారు. తొలి రోజే క్యాన్సర్ తో బాధ పడుతున్న సాయికుమార్ కు రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించి మగువల ఔదార్యాన్ని చాటారు. కార్యక్రమంలో మురళి కృష్ణ,కోటేశ్వరరావు, శివ ప్రసాద్,  పిల్లారి శెట్టి హరిబాబు, గాజుల రమేష్, గాజుల పూర్ణ చందర్ రావు,చంద్ర మోహన్, నాగేశ్వర రావు, శ్రీరాములు,డాక్టర్ సమ్మయ్య,లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు సభ్యులు పాల్గొన్నారు.