calender_icon.png 9 January, 2026 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిక కుల నూతన కమిటీ ఎన్నిక

06-01-2026 12:00:00 AM

మంగపేట, జనవరి 5 (విజయక్రాంతి): మంగపేట మండలంలోని చేరుపల్లి గ్రామం లో ములుగు జిల్లా పెఱిక కుల సెక్రటరీ ముత్తినేని ఆదినారాయణ  ఆధ్వర్యంలో పెఱిక (పురగిరి క్షత్రియ) కుల గ్రామ  కమిటీ ఎన్నిక ఆదివారం కుల మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఒక్కరి కోసం అందరం& అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ ఐక్యత, సామాజిక అభివృద్ధిపై నాయకులు ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ ఎన్నికల్లో అచ్చ ముకుందం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులుగా పోకల శ్రీకాంత్, ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సంతసాని భద్రయ్య,పూజారి నరేందర్,అచ్చే శ్రీను, ఖజానాదారుగా ( కోశాధికారిగా) బరపటి నరసింహారావు , సంయుక్త కార్యదర్శిగా అచ్చే నరేష్, మనోహర్ , మీడియా కార్యదర్శిగా మహేష్ ను నియమించారు. అలాగే కార్యవర్గ  సభ్యులు వెంకటేశ్వర్లు సత్యనారాయణ,వెంకన్న,కృష్ణయ్య,నగేష్ ను ఎన్నుకున్నారు.

సంఘానికి గౌరవ సలహాదారుగా ముత్తినేని రాజేశ్వరావు,పూజారి వెంకన్న,శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెఱిక కులం లోని  పలువురు  మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ కుల మిత్రుల సంక్షేమం, ఐక్యత కోసం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.