06-01-2026 12:00:00 AM
కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు, జనవరి5 (విజయక్రాంతి): మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. సోమవారం ఎస్.ఎస్.తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఎస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావులతో కలిసి జోనల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం చేయడంలో జోనల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని, జోనల్ అధికారులు సెక్టర్ అధికారులతో కలిసి తప్పనిసరిగా ఫీల్ విజిట్ చేయాలని సూచించారు.
జోనల్ అధికారులకు,సెక్టార్ అధికారులకు, వివిధ శాఖల అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మూడు షిఫ్టులవారీగా అధికారులు విధులు నిర్వర్తించాలని ముఖ్యంగా ప్రతి జోనల్ లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా ,పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చూసుకోవాలని ,భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.